Sircilla: ముస్తాబాద్‌లో మూడేళ్ల బాలిక అదృశ్యం.. పోలీసుల గాలింపు

Sircilla: సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో మూడేళ్ల చిన్నారి అమ్ములు అదృశ్యం. బాలిక ఆచూకీ తెలిస్తే వెంటనే ముస్తాబాద్ ఎస్సై జ్యోతికి సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 9:39 PM IST
Sircilla
X

Sircilla: ముస్తాబాద్‌లో మూడేళ్ల బాలిక అదృశ్యం.. పోలీసుల గాలింపు

ముస్తాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో మూడేళ్ల బాలిక అదృశ్యమైంది. ముస్తాబాద్‌లోని నవజ్యోతి స్కూల్ పక్కన ఉన్న గుడిసెలో నివాసం ఉంటున్న అమ్ములు అనే బాలిక గురువారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతకగా బాలిక ఆచూకీ లభించలేదు. పోతుగల్, ఆవునూరు పరిసర ప్రాంతాల్లో బాలిక ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు.

బాలిక ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించిన వారు వెంటనే ముస్తాబాద్ ఎస్సై జ్యోతికి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. చిన్నారి ఆచూకీ గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA