Raikal: బాపూజీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే డా. సంజయ్

Raikal: రాయికల్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

ANAND, JAGITYAL
Published on: 27 Sept 2026 12:52 PM IST
Raikal
X

Raikal: బాపూజీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే డా. సంజయ్

రాయికల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ కొనియాడారు. రాయికల్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. నాటి మహాత్మా గాంధీ తర్వాత ప్రజాదరణతో 'బాపూజీ'గా పిలువబడ్డ ఏకైక నాయకుడు ఆయనేనని గుర్తుచేశారు. ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బాపూజీ సేవలకు తగిన గుర్తింపు నిచ్చేలా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్‌టైల్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ప్రకటించి గౌరవించుకుందని తెలిపారు. ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, జగిత్యాల నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ రమాదేవి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజేశం, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL