Sircilla: సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా రఫీ నియామకం!
Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా రఫీ నియామకం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించిన నూతన అధ్యక్షుడు.
Sircilla: సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా రఫీ నియామకం!
Sircilla: కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ మైనార్టీ అధ్యక్షుడిగా రఫీ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న తన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి రఫీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మత్ ఉల్లా హుస్సేని, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, 4వ వార్డు కౌన్సిలర్ లైఖ్ సుల్తానా-తాజ్, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ముస్తాఫా, జిల్లా మైనార్టీ చైర్మన్ షేక్ రియాజ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు మైనార్టీ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రఫీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రతి గడపకు వాటి సమాచారం చేరేలా అవగాహన కల్పిస్తానని చెప్పారు.
ప్రజా సేవలో ముందుండి పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




