Ramagundam: ఆర్జీ-1లో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం

Ramagundam: సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు. నాణ్యతకు ప్రతి ఉద్యోగి కట్టుబడి ఉండాలని జీఎం లలిత్ కుమార్ పిలుపు.

VIJAY, RAMAGUNDAM
Published on: 12 Nov 2026 8:27 PM IST
Ramagundam
X

Ramagundam: ఆర్జీ-1లో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం

రామగుండం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలో గురువారం క్వాలిటీ విభాగం ఆధ్వర్యంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాణ్యతతోనే సంస్థ మనుగడ సాధ్యం - ప్రతి ఉద్యోగి నాణ్యతకు కట్టుబడి ఉండాలి . ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్, క్వాలిటీ జీఎం జె.వెంకటరమణ సూచన..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా ఆర్జీ వన్ జిఎం డి. లలిత్ కుమార్, క్వాలిటీ జీఎం జె.వెంకటరమణ హాజరై క్వాలిటీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరికి క్వాలిటీ అవగాహన కరపత్రాలను పంపిణీ చేసి ఉద్యోగులందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ మార్కెట్‌లో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు.

గనుల్లో బొగ్గు వెలికితీసే సమయంలో బండ, మట్టి, షేల్ లేయర్లను వేరుచేస్తూ మంచి గ్రేడ్ బొగ్గును లోడింగ్ చేయాలని సూచించారు. ఇప్పటికే జిడికె-2ఏ భూగర్భ గనిలో షేల్ లేయర్‌ను వేరు చేస్తూ నాణ్యతను పెంచుకున్నారని, అలాగే జిడికె వన్ ఇంక్లైన్‌లో మంచి నాణ్యత గల బొగ్గును అందిస్తుండటంతో స్థానిక వినియోగదారులు పోటీపడి మరీ రోజుకు సుమారు 500 టన్నుల బొగ్గును కొనుగోలు చేస్తున్నారని అభినందించారు.

ప్రతి పని ప్రదేశంలో సూపర్‌వైజర్ నుండి షావెల్ ఆపరేటర్ వరకు అందరూ సమష్టి కృషితో తమ బాధ్యతలను నిర్వర్తిస్తేనే నాణ్యత ప్రమాణాలను మరింత పెంచగలమని పేర్కొన్నారు. ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలు తక్కువ ధరలకు బొగ్గును విక్రయిస్తున్న నేపథ్యంలో, తీవ్రమైన మార్కెట్ పోటీని తట్టుకుని వినియోగదారులను కాపాడుకోవాలంటే నాణ్యత ఒక్కటే మార్గమని, క్షేత్రస్థాయి నుండి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని క్వాలిటీ జిఎం పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్వో టూ జీఎం కె. చంద్రశేఖర్,AGM కాశీ విశ్వేశ్వరరావు, క్వాలిటీ SOM యస్.ఓ.యం బ్రహ్మాజీ రావు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మి బాయి, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి,అధికారులు మోహన్ రావు, కర్ణ, వేణు, సురేష్,CMOAI ప్రతినిధి క్రాంతి కుమార్, AITUC ప్రతినిధి ఇజ్జగిరి రాజు తో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM