Peddapalli: రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ కరీంనగర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
Peddapalli: రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
Peddapalli: లంచం తీసుకుంటూ ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదైంది.
ఈ కేసు విచారణలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి లబ్ధి చేకూరుస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా బుధవారం రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.




