Sircilla: మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ గరిమ

Sircilla: కోనరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 5:37 PM IST
Sircilla
X

Sircilla: మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ గరిమ

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కోనరావుపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెనూ చార్ట్‌ను పరిశీలించి, వంటగది గోదాంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆరోజు మెనూ ప్రకారం భోజనం సిద్ధం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, మెనూ అమలుపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. హాస్టల్ పరిసరాలు, వంటగది పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు హాస్టల్‌లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని, తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA