Peddapalli: సంగీత, నృత్య పాఠశాల శిలాఫలకం వివాదంతో నాకు సంబంధం లేదు: ప్రిన్సిపాల్
Peddapalli: మంథని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల శిలాఫలకం ప్రోటోకాల్ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నన్ను ఇబ్బంది పెట్టొద్దని ప్రిన్సిపాల్ జె. శారద స్పష్టం చేశారు.
Peddapalli: సంగీత, నృత్య పాఠశాల శిలాఫలకం వివాదంతో నాకు సంబంధం లేదు: ప్రిన్సిపాల్
Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు లేకపోవడంపై వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఐఏఎస్‌కు లేఖ రాయడంతో ప్రోటోకాల్ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ జై శారద స్పందించారు. శిలాఫలకం ఎవరు ఏర్పాటు చేశారో తనకు తెలియదని, పాఠశాల భవనాన్ని ఇప్పటివరకు తనకు అధికారికంగా హ్యాండోవర్ చేయలేదని తెలిపారు. పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌గా హాజరుకావాలని ఆహ్వానించడంతోనే తాను వచ్చానని వివరించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ప్రారంభోత్సవానికి ఆహ్వానించినప్పటికీ, తనకు తెలియకుండానే శిలాఫలకాన్ని తయారు చేసి ఏర్పాటు చేశారని ఆమె ఆరోపించారు. శిలాఫలకం ఏర్పాటు, ప్రోటోకాల్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంలో తనకు ఏమీ తెలియదని, అనవసరంగా తనను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రిన్సిపాల్ జై శారద విజ్ఞప్తి చేశారు.మంథనిలో సంగీత, నృత్య పాఠశాల శిలాఫలకం వివాదంపై ప్రిన్సిపాల్ వివరణతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.




