Karimnagar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం!

Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం. ఓటర్ల తొలగింపును ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళన!

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 Oct 2026 7:30 PM IST
Karimnagar
X

Karimnagar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం!

కరీంనగర్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, తొలగించిన ఓటర్లలో అర్హులైన వారిని వెంటనే ఓటర్ లిస్టులో చేర్చాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని, డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సి ఈ సి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఓట్ల దొంగ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను హరించి వేస్తూ భారతదేశ ఎన్నికల వ్యవస్థను భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బిజెపి జేబు సంస్థగా పని చేస్తున్నాడని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందన్నారు జ్ఞానేష్ కుమార్ సీఈసీగా కాకుండా బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను సుమారు 13 కోట్ల పైచిలుకు ఓట్లు ఈసి తొలగించిందని విమర్శించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈసి ద్వారా ప్రయత్నం చేస్తున్నదన్నారు. జ్ఞానేష్ కుమార్ చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈసిని నడపాలి కానీ ఆయన నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. ఎన్నికల కమిషన్లో మరో ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలు వినకుండా, తన

ఇస్టారీతిన సర్ ప్రక్రియను మొదలుపెట్టారని విమర్శించారు.

దేశ పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అన్నారు.ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలమన్నారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ అర్హులైన వారి ఓట్లను ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు.

న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తీసేయడం సరైంది కాదన్నారు. అర్హులైన ఓట్లను కేంద్రం, ఈసి తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారి ఓట్లను తొలగించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. బీజేపీకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు, మేధావులు, అభ్యుదయ, ప్రగతిశీల శక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తులో జరిగే నిరసన పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వాసుదేవ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుంకర సంపత్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఉప్పునూటి శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి జి బీమా సాహెబ్, ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా నాయకులు రాయికంటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, సురేష్, రవి, రాజు, కే ప్రభాకర్, జె శంకరయ్య, సంతోష్, పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN