Huzurabad: హుజూరాబాద్‌లో రూ.1.50 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి పనులకు భూమిపూజ!
Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 4 ప్రధాన జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.1.50 కోట్లతో భూమిపూజ చేసిన ప్రణవ్ బాబు, చైర్‌పర్సన్ సుహాసిని.
Huzurabad: హుజూరాబాద్‌లో రూ.1.50 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి పనులకు భూమిపూజ!
Huzurabad: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో నాలుగు జంక్షన్లు కోటి యాభై లక్షల రూపాయలతో భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు గారు మరియు చైర్ పర్సన్ రొంటాల సుహాసిని గారు.
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వొడితల ప్రణవ్ బాబు గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు పట్టణంలోని మున్సిపల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 కోట్ల నగర అభివృద్ధి నిధుల నుండి 4 జంక్షన్ల ఏర్పాటు కోసం 1.50 కోటి యాభై లక్షల రూపాయలతో సిర్సపల్లి క్రాస్ రోడ్ వద్ద, సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద, డిపో క్రాస్ వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు, టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




