Karimnagar: నిరవధికంగా 5వ ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు!

Karimnagar: కరీంనగర్‌లో నిరవధికంగా 5వ ఆదివారం ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 Nov 2026 12:34 PM IST
Karimnagar
X

Karimnagar: నిరవధికంగా 5వ ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు!

Karimnagar: నిరవధికంగా 5 వ ఆదివారం కరీంనగర్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అధికార, అనధికార వ్యవస్థలు అన్నీ కూడా శాస్త్రీయంగా కొనసాగుతున్నాయి అంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ యొక్క స్ఫూర్తియే అని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం, భారత ప్రజలలో పరిపూర్ణంగా ఆచరణ జరగాలంటే మళ్ళీ అది రాజ్యాంగ అమలు ద్వారా జరుగుతుందని, రాజ్యాంగం ద్వారానే సాధించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి దూర దృష్టి ఈ దేశానికి దిక్సూచి అన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపెల్లి రామన్, చిగిరి శ్రీధర్, పెద్దల్లి శేఖర్, తాళ్ల వెంకటేష్, సోముడి మురళి, బత్తుల కనకరాజు, కొంపెల్లి రవీందర్, పాటకుల భూమయ్య, ఎడ్ల రాంకుమార్, మాడెపు నరసయ్య, మండిగ మాణిక్యరావు, కొత్తపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR