Gambhiraopet: విద్యుత్ సిబ్బంది సాహసం - చెరువు మధ్యలో తెప్పపై వెళ్లి మరమ్మతులు!

Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభానికి తెప్పపై వెళ్లి మరమ్మతులు చేసిన విద్యుత్ సిబ్బంది.

KALEEM, SIRICILLA
Published on: 28 Sept 2026 11:00 AM IST
Gambhiraopet
X

Gambhiraopet: విద్యుత్ సిబ్బంది సాహసం - చెరువు మధ్యలో తెప్పపై వెళ్లి మరమ్మతులు!

Gambhiraopet: మండలంలో విద్యుత్ సిబ్బంది సాహసం చాటారు. మండల కేంద్రం నుంచి దమ్మున్నపేటకు వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సమస్యను గుర్తించిన విద్యుత్ సిబ్బంది.. నమాజ్ చెరువు మధ్యలోని విద్యుత్ స్తంభంపై బ్రేక్‌డౌన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో తెప్పపై చెరువు మధ్యలోకి వెళ్లి మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ స్తంభం ఎక్కి సాంకేతిక సమస్యను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

చెరువు మధ్యలోకి తెప్పపై వెళ్లి విద్యుత్ సమస్యను పరిష్కరించిన సిబ్బందిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA