Illanthakunta: కందికట్కూరు బ్రిడ్జిపై ప్రమాదకర గుంత - ఇబ్బందుల్లో ప్రజలు!

Illanthakunta: కందికట్కూరు బ్రిడ్జిపై ప్రమాదకర గుంత. బతుకమ్మ పండుగ వేళ రాకపోకలకు మహిళలు తీవ్ర ఇబ్బందులు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని బిజెపి నాయకులు డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 10 Oct 2026 10:33 AM IST
Illanthakunta
X

Illanthakunta: కందికట్కూరు బ్రిడ్జిపై ప్రమాదకర గుంత - ఇబ్బందుల్లో ప్రజలు!

Illanthakunta: ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో మధ్య మానేరు ఎల్లమ్మ గుడికి వెళ్లే మార్గంలోని బ్రిడ్జి మధ్యలో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ బతుకమ్మలను తీసుకొని మధ్య మానేరు వాగు వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి మధ్యలో గుంత ఏర్పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జిని పరిశీలించి, మరమ్మతు పనులు చేపట్టాలని బీజేపీ మండల నాయకుడు భూమల్ల ప్రశాంత్ కోరారు. పండుగ సమయంలో మహిళలు, గ్రామ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA