Porumamilla: తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయ అరంగేట్రం: ముత్యాల లక్ష్మీదేవి!

Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల (సంచర్ల) గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి తండ్రి ఆశయ సాధన కోసం ముత్యాల లక్ష్మీదేవి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

P Upendra, Kadapa Porumamilla
Published on: 18 Nov 2026 11:42 AM IST
Porumamilla
X

Porumamilla: తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయ అరంగేట్రం: ముత్యాల లక్ష్మీదేవి!

పోరుమామిళ్ల: తండ్రి రాజకీయ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ముత్యాల లక్ష్మీదేవి తెలిపారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల (సంచర్ల) గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆమె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

తండ్రి అంబవరం వెంకటరెడ్డి ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో, భర్త ముత్యాల భాస్కర్ రెడ్డి ఆశీస్సులతో ఆమె రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతో ప్రజాసేవకు సిద్ధమయ్యారు. ఆమెకు అన్న డాక్టర్ అంబవరం కొండారెడ్డి, బావ ముత్యాల మాబురెడ్డి, తమ్ముడు జనార్దన్ రెడ్డి అండగా నిలుస్తూ ఎన్నికల ప్రచారంలో సహకారం అందిస్తున్నారు.

యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని, గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నాలుగు గ్రామాలకు చెందిన యువత, టీడీపీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో సోమవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ సందర్భంగా ముత్యాల లక్ష్మీదేవి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో ఎన్నికల బరిలో నిలుస్తున్నానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్యం, రహదారుల మెరుగుదల, వీధి దీపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

తండ్రి ఆశయాలను నెరవేర్చడంతో పాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజాసేవకు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ముత్యాల లక్ష్మీదేవి ఎన్నికల రంగప్రవేశం నాగలకుంట్ల (సంచర్ల) గ్రామంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla