Sircilla: సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితేకు పోలీస్ అధికారుల సంఘం అభినందనలు!
Sircilla: గణేష్ నిమజ్జనం, సీఎం పర్యటనను ప్రశాంతంగా నిర్వహించినందుకు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితేను అభినందించిన పోలీస్ అధికారుల సంఘం.
Sircilla: సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితేకు పోలీస్ అధికారుల సంఘం అభినందనలు!
Sircilla: సిరిసిల్ల జిల్లాలో గణేష్ నిమజ్జనం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేను పోలీస్ అధికారుల సంఘం సభ్యులు అభినందించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తు నిర్వహణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పోలీసు అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేష్ నిమజ్జనం, ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతంగా నిర్వహించడంలో ఎస్పీ చూపిన నాయకత్వాన్ని పోలీస్ అధికారుల సంఘం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షుడు ఎస్‌ఐ వెంకట్రాజం, సెక్రటరీ నాగేశ్వరరావు, శ్రీనాథ్ రాజ్, ప్రకాష్, వేణు, తిరుపతి, మహేష్ పాల్గొన్నారు.




