Sircilla: సిరిసిల్ల పోలీసుల వీక్లీ పరేడ్.. ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు వీక్లీ పరేడ్ నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Nov 2026 9:50 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల పోలీసుల వీక్లీ పరేడ్.. ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఆర్‌ఐ అడ్మిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరేడ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీస్, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన వివిధ డ్రిల్స్‌ను ఆర్‌ఐ అడ్మిన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్‌ఐ సురేష్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట పాటు యోగా, ధ్యానం లేదా నడకను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. బయట ఆహారం తీసుకోవడం సాధ్యమైనంత వరకు తగ్గించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వీక్లీ పరేడ్‌తో సిబ్బందిలో క్రమశిక్షణ, ఐక్యత, సమన్వయం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు.

అనంతరం పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్. సతీష్ కుమార్ గుండె ఆరోగ్యం, గుండెపోటు నివారణ, రక్తపోటు, మధుమేహం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రమేష్, పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA