Manthani: సింగరేణి భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు: 8 మంది అరెస్ట్!

Manthani: మంథని మండలం రచ్చపల్లి వద్ద సింగరేణి భూముల్లో అక్రమంగా మట్టి తవ్వుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, జేసీబీ, 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 5 Oct 2026 9:34 PM IST
Manthani
X

Manthani: సింగరేణి భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు: 8 మంది అరెస్ట్!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మండల శివారులోని రచ్చపల్లి ప్లాంటేషన్‌ సమీపంలో సింగరేణి సంస్థకు చెందిన భూమిలో సోమవారం రాత్రి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మంథని ఎస్సై సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వుతున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక జేసీబీతో పాటు మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

సింగరేణి సంస్థకు చెందిన భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి, వాణిజ్య అవసరాలకు తరలిస్తున్న వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI