Sircilla: మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు!

Sircilla: ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకురాలు మౌనికపై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Nov 2026 11:17 AM IST
Sircilla
X

Sircilla: మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా వేదికగా మహిళా నాయకురాలిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డిపేట మండల మహిళా అధ్యక్షురాలు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకురాలు మాట్లాడారు. ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వీడియోను 'సిరిసిల్ల టీఆర్ఎస్' పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. అయితే ఆ వీడియో కింద బీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తి అసభ్యకర పదజాలంతో కామెంట్ చేసినట్లు మౌనిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌనిక, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట పోలీసులను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలు, కామెంట్ చేసిన వ్యక్తి గుర్తింపుపై విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు కదిరే రేణుక, జిల్లా యువ నాయకుడు సయ్యద్ జావిద్, నియోజకవర్గ యువ నాయకులు బందెల రాజు, బొమ్మన వేణి, రాజకుమార్, శ్రీధర్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొడుముజా బాబు, ఉపాధ్యక్షుడు బొమ్మన వేణి పరశురాములు, కోశాధికారి బైరి రాజేష్, కార్యదర్శి ఓర్సు అశోక్, పట్టణ నాయకుడు కొర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA