Manthani: జెడ్పీహెచ్‌ఎస్ బడిలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన!

Manthani: సురక్షిత్ బచ్చన్ అభియాన్‌లో భాగంగా మంథని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులపై సీనియర్ సివిల్ జడ్జి మల్లాడి అపర్ణ అవగాహన కల్పించారు.

SHANKAR, MANTHANI
Published on: 26 Oct 2026 5:50 PM IST
Manthani
X

Manthani: జెడ్పీహెచ్‌ఎస్ బడిలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన!

Manthani: సురక్షిత్ బచ్చన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి మల్లాడి అపర్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పోక్సో చట్టం (POCSO Act) గురించి వివరించారు. బాలలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ, తమ హక్కుల పట్ల అవగాహన, ఆపద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం గీట్ల భరత్ రెడ్డి, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె. రఘోత్తం రెడ్డి, న్యాయవాదులు శశిభూషణ్ కాచే, గౌతమి శ్రీలక్ష్మి, వ్యాస్ కుమార్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI