Karimnagar: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి పీఎంకే ఫౌండేషన్ సాయం!

Karimnagar: కోరపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్యామ్ కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించిన పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్.

GANESH, JAMMIKUNTA
Published on: 4 Oct 2026 11:02 AM IST
Karimnagar
X

Karimnagar: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి పీఎంకే ఫౌండేషన్ సాయం!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేణ శ్యాం ఇటీవల జమ్మికుంట పట్టణంలోని ఎఫ్ సి ఐ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు కోరపల్లిలోని మృతుడి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం ఫౌండేషన్ నిర్వాహకులు అందించారు. భవిష్యత్తులో శ్యామ్ కుటుంబానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్ మోగు దెబ్బ గౌడు సంఘ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA