Thangallapalli: పార్టీలకతీతంగా ప్రజాపాలన: మునిగెల రాజు
Thangallapalli: పార్టీలకు అతీతంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని తంగళ్ళపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగెల రాజు గోపాల్రావుపల్లెలో పేర్కొన్నారు.
Thangallapalli: పార్టీలకతీతంగా ప్రజాపాలన: మునిగెల రాజు
Rajanna Sircilla: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తంగ్గళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగెల రాజు అన్నారు. గోపాల్రావుపల్లె గ్రామంలో స్థానిక సర్పంచ్తో కలిసి ఆయన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మునిగెల రాజు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో గ్రామంలోని ప్రధాన కూడళ్లలో వెలుతురు అందుబాటులోకి రావడంతో పాటు, రాత్రివేళ ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. గ్రామాల అవసరాలను గుర్తించి నిధులను వినియోగిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గుండు ప్రేమ్, సదానందం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్, ఏఎంసీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కటకం రాజు, మిరాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, కొండవేని రవి, సునీల్ రెడ్డి, ప్రేమ్, శ్రీధర్, తిరుపతితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.




