Peddapalli: వన్యప్రాణుల బాధితులకు పరిహారం పథకంపై అవగాహన

Peddapalli: పెద్దపల్లి పెద్దంపేట, రామగిరి స్కూల్లో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ బాధితుల 2025 పథకంపై అవగాహన; పరిహారం, న్యాయ సహాయం, మత్తు పదార్థాలపై సూచనలు.

RAJU, PEDDAPALLI
Published on: 21 Nov 2026 6:44 PM IST
Peddapalli
X

Peddapalli: వన్యప్రాణుల బాధితులకు పరిహారం పథకంపై అవగాహన

పెద్దపల్లి: న్యాయ సేవా అధికార సంస్థ, పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దంపేట గ్రామంలో మరియు రామగిరి పాఠశాలలో మానవ - వన్యప్రాణుల సంఘర్షణ బాధితులకు 2025 పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు మరియు విద్యార్థులకు వన్యప్రాణుల దాడుల వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టం, గాయాలు, పంట నష్టం వంటి విషయాలలో బాధితులకు ప్రభుత్వం ద్వారా అందే పరిహారం, సహాయం గురించి వివరించారు.

ఈ పథకం కింద అర్హులైన బాధితులు ఎవరు, పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు అవసరం, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి అనే అంశాలపై వివరణ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం మరియు వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలపై కూడా అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేసి, గ్రామస్తుల సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అమ్ముల శ్రీనివాస్, సర్పంచ్, నవీన్, పంచాయత్ కార్యదర్శి, నుచ్చు శ్రీనివాస్, భాను కృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సెల్ సభ్యులు, ఏ. మాధవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, కె. కొమురయ్య, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, సయ్యద్ రహిమతుల్లా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయ సేవా అధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI