Peddapalli: రూపనారాయణపేట హై లెవల్ బ్రిడ్జి పనులను పునఃప్రారంభించిన విప్ విజయరమణ రావు!

Peddapalli: రూపనారాయణపేట మానేరు వాగుపై రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి పనులను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు పునఃప్రారంభించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 11 Nov 2026 1:33 PM IST
Peddapalli
X

Peddapalli: రూపనారాయణపేట హై లెవల్ బ్రిడ్జి పనులను పునఃప్రారంభించిన విప్ విజయరమణ రావు!

Peddapalli: పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం రూపనారాయణపేట మానేరు వాగుపై జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం వరకు రూ. 80 కోట్ల నిధులతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి పనులను తిరిగి పునఃప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓదెల మండలం రూపనారాయణపేట మానేరు వాగుపై జమ్మికుంట మండలం విలాసాగర్ వరకు అవసరమైన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 80 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని వాటి పనులను గత కొన్ని నెలల క్రితం ప్రారంభించుకోవడం కూడా జరిగిందని కానీ సంబంధిత కాంట్రాక్టర్ల లోపంతో పనులు పూర్తి కాలేదని ఆ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఇతర కాంట్రాక్టర్ కు అప్పగించి తిరిగి ఈరోజు బుధవారం రోజున పనులను పునఃప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు.

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల నుండి జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్ వెళ్ళే ప్రజలకు వీలుగా వారి దూర భారాన్ని తగ్గించే విధంగా రూపునారాయణపేట మానేరు వాగుపై హై లెవల్ వంతెన నిర్మించడం జరుగుతుందని దాని వల్ల తరచూ పెద్దపల్లి నియోజకవర్గం నుండి జమ్మికుంట మరియు జమ్మికుంట, హుజురాబాద్ నుండి పెద్దపల్లి కి వచ్చే ప్రజలకు ప్రయాణ దూరం మరియు సమయం తగ్గుతుందని అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట మంత్రివర్గం సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రూపునారాయణపేట మానేరు వాగుపై హై లెవల్ వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, సింగిల్ విండో చైర్మన్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,యూత్ నాయకులు, గ్రామాల ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli