Peddapalli: ఐటీఐలో వాకింగ్ ట్రాక్.. జెండా చౌరస్తాలో 150 అడుగుల జెండా

Peddapalli: పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్‌లో వాకింగ్ ట్రాక్, లైటింగ్, జెండా చౌరస్తాలో 150 అడుగుల జాతీయ జెండా, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయరమణ రావు.

RAJU, PEDDAPALLI
Published on: 21 Nov 2026 5:53 PM IST
Peddapalli
X

Peddapalli: ఐటీఐలో వాకింగ్ ట్రాక్.. జెండా చౌరస్తాలో 150 అడుగుల జెండా

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో అభివృద్ధి పనులను పరిశీలించి, వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తెలిపారు.

అనంతరం పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడంతో పాటు జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసే భారీ జాతీయ జెండా స్థలాన్ని పరిశీలించారు. అభివృద్ధిలో భాగంగా తొలగించిన పాత కమాన్ ప్రాంతంలో త్వరలో నూతన హంగులతో కమాన్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు.

పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద 150 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నట్లు, జెండా నుండి మసీదు చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

తదుపరి పెద్దపల్లి మండలం నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో సింగిల్ విండో & ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులందరూ ఎల్ నినో పట్ల ఆలోచన చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, పట్టణ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI