Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Peddapalli: పెద్దపల్లిలో ట్రాఫిక్ నిబంధనలపై ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.

RAJU, PEDDAPALLI
Published on: 30 Oct 2026 1:33 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Peddapalli: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. ప్రతి వాహనానికి సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండటంతో పాటు, వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కామన్, అయ్యప్ప గుడి చౌరస్తాల వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనదారులను తనిఖీ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనానికి ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సరైన పత్రాలు ఉండాలని సూచించారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

వాహనదారుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌తోనైనా వాహనదారుల్లో మార్పు రావాలని అధికారులు ఆశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు..

ఈ కార్యక్రమంలో ఎసిపి శ్రీనివాస్ తో పాటు ట్రాఫిక్ సిఐఎస్ఐ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు..

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI