Peddapalli: భూభారతి రీ సర్వేకు రైతులు సహకరించాలి: తహసీల్దార్ పడాల ప్రసాద్
Peddapalli: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్‌లో భూభారతి రీ సర్వేను తహసీల్దార్ పడాల ప్రసాద్, సర్పంచ్ జూపాక మమత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Peddapalli: భూభారతి రీ సర్వేకు రైతులు సహకరించాలి: తహసీల్దార్ పడాల ప్రసాద్
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలో భూభారతి రీ సర్వే కార్యక్రమం గ్రామ సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పడాల ప్రసాద్ క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడి, భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్ మాట్లాడుతూ, భూభారతి రీ సర్వే ప్రక్రియలో రైతులందరూ అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామంలో భూములకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించి, భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసి, భూమిపై హక్కులు కలిగిన అర్హులైన నిరుపేద రైతులకు పట్టా పత్రాలు అందించాలని అధికారులను కోరారు.
భూముల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, ఎన్నో ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన పేద రైతుల సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వే లలిత మేడం , ఆర్ఐ గుంట రమేష్ , gpo నంది శ్రీనివాస్ , సర్వే ర్ అభిషేక్ లు రైతులు ప్రజలు పాల్గొన్నారు.




