Sultanabad: సుల్తానాబాద్ మార్కెట్‌లో వర్షార్పణమైన వరి ధాన్యం!
Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని రైతులు కోరారు.
Sultanabad: సుల్తానాబాద్ మార్కెట్‌లో వర్షార్పణమైన వరి ధాన్యం!
సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డులో సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్‌లోని ధాన్యం రాశులపై వర్షపు నీరు ప్రవహించడంతో ధాన్యం నీటిపాలైంది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో తీరని నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు.
వర్షానికి తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో తిరస్కరించకుండా, తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే 'ఏ' గ్రేడ్ మద్దతు ధర ఇచ్చి తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డుకు చేరిన ధాన్యానికి తక్షణమే తూకాలు వేసి మిల్లులకు తరలించాలి.
ధాన్యం నిల్వలు పాడవకుండా సరిపడా తార్పాలిన్లను యార్డులో ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరారు.అధికారులు తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.




