Peddapalli: రైతులకు ఎస్సారెస్పీ సాగునీరు: ప్రభుత్వ విప్ విజయరమణ రావు!

Peddapalli: ఎల్ నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల చేయించినట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు.

RAJU, PEDDAPALLI
Published on: 16 Oct 2026 2:21 PM IST
Peddapalli
X

Peddapalli: రైతులకు ఎస్సారెస్పీ సాగునీరు: ప్రభుత్వ విప్ విజయరమణ రావు!

పెద్దపల్లి: ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి, పంటలకు చివరి తడులు పెట్టేందుకు రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ నుండి సాగునీరు విడుదల చేయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.

డి-83, డి-86 ప్రధాన కాల్వల ద్వారా పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు సరఫరా అవుతున్న నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీలో నీరు తక్కువగా ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని ఒప్పించామన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి నీటిని విడుదల చేయించామని తెలిపారు.

రైతుల కోసం నిరంతరం పని చేస్తామని, రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగుల మల్లయ్య కౌన్సిలర్ తోట ఫణీంద్ర భూపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సందులో పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI