Peddapalli: రామగుండంలో సింగరేణి పెండింగ్ పారిశ్రామిక వివాదాలపై సమీక్షా సమావేశం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో పెండింగ్ పారిశ్రామిక వివాదాలు (CGIT Cases) పరిష్కారంపై ప్రత్యేక సమీక్షా సమావేశం.
Peddapalli: రామగుండంలో సింగరేణి పెండింగ్ పారిశ్రామిక వివాదాలపై సమీక్షా సమావేశం!
Peddapalli: సింగరేణి యాజమమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశ్రామిక వివాదాల పరిష్కార కార్యక్రమములో భాగముగా (Special Campaign for Disposal of Industrial Disputes Before CGIT) ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్జీ-1, ఆర్జీ-2 మరియు ఆర్జీ-3 మరియు APA ఏరియాలకు చెందిన పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం కమిటీ కన్వీనర్ & హెచ్.ఓ.డి (లా), శ్రీమతి అప్రిన్ సుల్తానా, ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఫైనాన్స్ అధికారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు హైదరాబాద్లోని CGIT-cum-Labour Court ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగముగా కమిటి సమావేశం నిర్వహించి ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 & APA ఏరియాలకు చెందిన CGIT pending Case ను సమీక్ష చేయడం జరిగినది.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు హెచ్.ఓ.డి (లా), శ్రీమతి అప్రిన్ సుల్తానా, ఆర్జీ. రీజియన్, ఆర్జీ. 1 ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఆర్జీ.1 డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, ఆర్జీ. 2 డివై పియం సునీల్, ఆర్జీ.2 డిజియం ఫైనాన్స్ రాంచందర్, ఆర్జీ.3, APA సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు రాజేశం, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.




