Peddapalli: పందిళ్లలో బైకు అదుపుతప్పి గాయపడిన యువకులు!
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్లలో బైకు అదుపుతప్పి గాయపడిన యువకులను ఎస్సై గట్ల సుధాకర్ తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
Peddapalli: పందిళ్లలో బైకు అదుపుతప్పి గాయపడిన యువకులు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామంలో బైకు అదుపుతప్పి గాయపడిన ఇద్దరు యువకులను ఎస్సై గట్ల సుధాకర్ తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. పందిళ్ల గ్రామంలో బైకు అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై గట్ల సుధాకర్ ప్రమాదని గుర్తించి వెంటనే స్పందించారు. క్షతగాత్రుల పరిస్థితిని గమనించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా వారిని తన సొంత వాహనంలో కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు.
ఆపదలో ఉన్న క్షతగాత్రులను రక్షించి పోలీసుల మానవతా కోణాన్ని చాటిన ఎస్సై సుధాకర్ చొరవను స్థానికులు మరియు గ్రామస్తులు ప్రత్యేకంగా కొనియాడారు.




