Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ లో ఘనంగా సవన్నా సీడ్ కంపెనీ 16వ వార్షికోత్సవం
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా సవన్నా సీడ్ కంపెనీ 16వ వార్షికోత్సవం; మొక్కలు నాటి, విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ.
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ లో ఘనంగా సవన్నా సీడ్ కంపెనీ 16వ వార్షికోత్సవం
Peddapalli: సవన్నా సీడ్ కంపెనీ నాణ్యమైన విత్తనాలను అందిస్తూ రైతుల నమ్మకాన్ని గెలుచుకుంటుందని కంపెనీ మేనేజర్ రోహిత్ గుప్తా అన్నారు . పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సవన్నా సీడ్ కంపెనీ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంపెనీ మేనేజర్ రోహిత్ గుప్తా, కాల్వ శ్రీరాంపుర్ మండల ఆర్గనైజర్ వడ్డూరి సాగర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి కంపెనీ ప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్ లో సవన్నా సీడ్ కంపెనీ 16వ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కంపెనీ మేనేజర్ రోహిత్ గుప్తా, మాట్లాడుతూ కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములైన రైతులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సవన్నా సీడ్ కంపెనీ నాణ్యమైన విత్తనాలను అందిస్తూ రైతుల నమ్మకాన్ని గెలుచుకుందని, భవిష్యత్తులోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉత్తమ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రభుత్వం పాఠశాలలో కంపెనీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు శేఖర్, రాజు కిరణ్, వడ్లూరి సాగర్, రమేష్ ,రాజు ,వెంకటేష్ సంతోష్ ,ప్రవీణ్, అనిల్, వెంకట్రావు ,తదితరులు ఉన్నారు.




