Ramagundam: జంగాలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దీపావళి!
Ramagundam: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జంగాలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసితులతో కలిసి ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కుటుంబసమేతంగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
Ramagundam: జంగాలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దీపావళి!
రామగుండం: రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదివారం గోదావరిఖని జంగాలపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాల మధ్య దీపావళి పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్థానిక కుటుంబాలతో మమేకమై దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులతో కలిసి పండుగ సంతోషాలను పంచుకుంటూ, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సంతోషాల్లో భాగస్వాములు కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దీపావళి పండుగ ప్రతి ఇంటా వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే స్ఫూర్తితో ప్రజల మధ్యనే పండుగ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తమ బాధ్యత అని, రామగుండం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకునేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య గారు, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో కలిసి, ప్రజల మధ్య దీపావళి పండుగను జరుపుకోవడంతో జంగాలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది.




