Peddapalli: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి: కలెక్టర్ శ్రీహర్ష!
Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Peddapalli: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి: కలెక్టర్ శ్రీహర్ష!
పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీనివాస్ తో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జోగుల లచ్చయ్య సర్వే నెం.429లో గల 7 గుంటల భూమికి పట్టాదారు హక్కులు ఇప్పించాలని కోరగా, చర్యలు తీసుకోవాలని ధర్మారం తహసీల్దార్ ను ఆదేశించారు. శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన జాసోదపు లక్ష్మి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, పీడీ హౌసింగ్ కు రాశారు.
మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన గాజుల ప్రశాంత్ తాను దివ్యాంగుడినని, డిగ్రీ పూర్తి చేశానని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరగా, వారధి సొసైటీకి రాశారు. రామగుండం గోదావరిఖని 18 ఇంక్లైన్ కాలనీకి చెందిన గంట నరసమ్మ గృహజ్యోతి పథకం మంజూరు చేయాలని కోరగా, రామగుండం ఎంపీడీవోకు రాశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.




