Peddapalli: ట్రాన్స్‌జెండర్ల హక్కులు, రక్షణపై పెద్దపల్లి పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం!

Peddapalli: రామగుండం సీపీ ఆదేశాలతో పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన సదస్సు. సీఐ రమేష్ బాబు కీలక సూచనలు.

VIJAY, RAMAGUNDAM
Published on: 6 Nov 2026 5:57 PM IST
Peddapalli
X

Peddapalli: ట్రాన్స్‌జెండర్ల హక్కులు, రక్షణపై పెద్దపల్లి పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం!

Peddapalli: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం,హక్కుల పరిరక్షణ, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

శుక్రవారం పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని ట్రాన్స్‌జెండర్లకు ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్ బాబు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం–2019 ప్రకారం ట్రాన్స్‌జెండర్లపై ఎలాంటి వివక్ష, వేధింపులకు తావులేదని తెలిపారు. విద్య, ఉపాధి, నివాసం తదితర అంశాల్లో వారికి చట్టపరమైన రక్షణ కల్పించబడుతుందని వివరించారు.

ఎవరైనా అవమానించినా, వేధించినా లేదా తమ హక్కులకు భంగం కలిగించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోని ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా వారి భద్రత, సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే ట్రాన్స్‌జెండర్ల హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహనను సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రాన్స్‌జెండర్ల పట్ల ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరూ గౌరవం, సమానత్వ భావనతో వ్యవహరించాలని ఇన్‌స్పెక్టర్ రమేష్ బాబు సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవళి, షీ టీమ్ ఎస్‌ఐ లావణ్య, పోలీస్ సిబ్బంది, పెద్దపల్లి భరోసా కేంద్రం ఇన్‌చార్జ్ ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM