Peddapalli: పెద్దపల్లిలో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

Peddapalli: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యలపై టాస్క్‌‌ఫోర్స్, స్థానిక పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

RAJU, PEDDAPALLI
Published on: 1 Oct 2026 9:25 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

పెద్దపల్లి: మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి వల్ల యువత మరియు విద్యార్థుల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు గురువారం పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ SI J. లక్ష్మణ్ రావు, పెద్దపల్లి SI K.నరేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ SI J.లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే సామాజిక, ఆరోగ్య మరియు చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.

యువత మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని పోలీసులు సూచించారు.

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI