Peddapalli: పెద్దబొంకూరు మాజీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్‌లోకి!
Peddapalli: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు మాజీ ఉపసర్పంచ్ కల్వల సంపత్, వార్డు సభ్యులు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Peddapalli: పెద్దబొంకూరు మాజీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్‌లోకి!
పెద్దపల్లి: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కల్వల సంపత్, వార్డు సభ్యులు కల్వల శ్రీలత రామరాజు, వార్డు సభ్యులు రాజేశం గౌడ్, వార్డు సభ్యులు మిట్టపల్లి మహేశ్వరి రాజేశం, కల్వల లచ్చయ్య, కల్వల సదానందం, తగరం జయరాజు, కల్వల రాజేశం, తగరం కోటేశ్, తగరం కమల్, తగరం వంశీ, కల్వల సంపత్, కల్వల విఘ్నేష్, కల్వల లచ్చయ్య, కల్వల శ్రీనివాస్ గార్లు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, పెద్దబొంకూరు నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.




