Peddapalli: రాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చైర్మన్ ముత్యాల నరేష్
Peddapalli: పెద్దపల్లి మండలం రాంపల్లిలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ ప్రారంభించి, ప్రతి బస్తా 41 కిలోలు తూకం వేయాలని ఆదేశించారు.
Peddapalli: రాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చైర్మన్ ముత్యాల నరేష్
పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదేశాల మేరకు రాంపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ ప్రారంభించారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం, చెల్లింపులు తదితర అంశాలపై వారి సమస్యలు, సూచనలు తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం చందపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం బస్తాల తూకాన్ని పరిశీలించారు. ప్రతి ధాన్యం బస్తా 41 కిలోల బరువుతోనే తూకం వేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాంపల్లి సర్పంచ్ సంపత్ రావు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్లు జూపల్లి తిరుపతి రావు, పిన్‌రెడ్డి సుధాకర్ రెడ్డి, దొనేటి రామ్మోహన్ స్వరూప, పెద్దపల్లి పీఏసీఎస్ సీఈఓ మధన్‌మోహన్, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




