Odhela: కొలనూర్‌కు నూతన ప్యాక్స్ మంజూరు.. సంబరాలు

Odhela: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు కావడంతో నేతలు, రైతులు పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 19 Nov 2026 6:00 PM IST
Odhela
X

Odhela: కొలనూర్‌కు నూతన ప్యాక్స్ మంజూరు.. సంబరాలు

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్ గ్రామానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి తెలిపారు. కొలనూర్ గ్రామానికి సొసైటీ (పాక్స్) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొలనూర్ గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు కలిసి సంబరాలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, పరస్పరం స్వీట్లు పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ... పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎన్నికల సమయంలో కొలనూరు గ్రామానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని అన్న మాట ప్రకారం కొలనూర్ గ్రామానికి సహకార సంఘం మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబుకి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

కొలనూర్ పరిసర ప్రాంత రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా నూతన పాక్స్ మంజూరు చేసినందుకు ప్రజా ప్రభుత్వానికి, చొరవ చూపిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆల సుమన్ రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, స్థానిక కొలనూరు సర్పంచ్ పల్లె కనకయ్య,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పిట్టల రవికుమార్, డిసిసి అధికార ప్రతినిధి బైరి రవి గౌడ్, సర్పంచులు నిమ్మ నాయక్, గోలి లింగారెడ్డి, ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డ శంకర్, కొప్పుల రవి, పడాల రాజు, జంగం కొమురయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli