Manthani: మహాచండీయాగంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్ష దంపతులు!

Manthani: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో లీడర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన చండీ హోమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, గీతారాణి దంపతులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI
Published on: 16 Oct 2026 7:14 PM IST
Manthani
X

Manthani: మహాచండీయాగంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్ష దంపతులు!

మంథాని: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో లీడర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గామాత మండపంలో నిర్వహించిన చండీ హోమం కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, ఆయన సతీమణి గీతారాణి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొడ్డ బాలాజీ–గీతారాణి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ దీక్షాపరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI