Peddapalli: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: డీఎంహెచ్‌ఓ!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఎంహెచ్‌ఓ డా. వై. పవిత్ర ఎంఎల్‌హెచ్‌పీల సమీక్షలో ఆదేశించారు.

RAJU, PEDDAPALLI
Published on: 27 Nov 2026 2:05 PM IST
Peddapalli
X

Peddapalli: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: డీఎంహెచ్‌ఓ!

Peddapalli: DMHO డా. వై. పవిత్ర ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సబ్ సెంటర్ల MLHPలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ - జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని, గర్భిణీలను ముందుగానే గుర్తించి సకాలంలో ANC పరీక్షలు చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి అనవసర సిజేరియన్లను తగ్గించాలని, హైరిస్క్ గర్భిణీలను గుర్తించి రిఫర్ చేయాలని సూచించారు.

TB నిర్మూలన, టీకాలు, కుటుంబ నియంత్రణ, NCD స్క్రీనింగ్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, రికార్డులు, ఆన్‌లైన్ నివేదికలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ DMHO డా. శ్రీరాములు, NTEP ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సుధాకర్ రెడ్డి, DIO డా. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI