Peddapalli: రోడ్డు సమస్యకు రూ. 10 లక్షలు మంజూరు చేసిన ఎంపీ

Peddapalli: పెద్దపల్లి జిల్లా మల్యాలలో రోడ్డు సమస్య పరిష్కారానికి రూ. 10 లక్షల ఎంపీలాడ్స్ నిధులు మంజూరు చేసి, విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఎంపీ వంశీకృష్ణ.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 Nov 2026 8:55 PM IST
Peddapalli
X

Peddapalli: రోడ్డు సమస్యకు రూ. 10 లక్షలు మంజూరు చేసిన ఎంపీ

పెద్దపల్లి: ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించడం, పేద విద్యార్థులకు అండగా నిలవడమే తన మొదటి ప్రాధాన్యత అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలంలోని మల్యాల గ్రామంలో నెలకొన్న రోడ్డు సమస్యను సర్పంచ్ బూసి సదాశివరెడ్డి ఎంపి దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ ల్యాడ్స్ (MPLADS) నిధుల నుంచి క్షణం ఆలస్యం చేయకుండా రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

​అనంతరం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 47 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరిన విధంగా విద్యార్థులకు అవసరమైన బెంచీలు, సురక్షిత మంచినీటి కోసం ఆర్వో (RO) వాటర్ ప్లాంట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

​ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. "ప్రజలకు సేవ చేయడం, పది మందికి ఉపయోగపడే పనులు చేయడమే మా తాతగారు నాకు నేర్పిన జీవిత పాఠం. 'ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వే టు సక్సెస్' అని ఆయన బలంగా నమ్మేవారు. విద్య ఒక్కటే పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపగలదు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు, వారి ఉన్నత చదువులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు నేను నిరంతరం ముందుంటాను" అని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli