Manthani: మంథనిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ!

Manthani: మంథనిలో సీనియర్ జర్నలిస్టులు పోతరాజు సమ్మయ్య, పెండ్యాల రామకుమార్ కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

SHANKAR, MANTHANI
Published on: 26 Oct 2026 7:10 PM IST
Manthani
X

Manthani: మంథనిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ!

మంథాని: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మంథని పట్టణంలో పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. సీనియర్ జర్నలిస్ట్, పెద్దపల్లి జిల్లా ఎథిక్స్ కమిటీ చైర్మన్, మంథని ఆంధ్రజ్యోతి ఇంచార్జ్ పోతరాజు సమ్మయ్య తల్లి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామకుమార్ తండ్రి తిరుమలయ్య కూడా ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. గోదావరిఖని ఏ సి పి మడత రమేష్, మంథని పాత్రికేయుల బృందం పరామర్శించారు. వెంకటమ్మ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులైన పోతరాజు శ్రీనివాస్, వెంకటేష్, వెంకటలక్ష్మి, తిరుమల, స్వప్నలను ఓదార్చి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, మాల సంఘం నాయకులు ఎడ్ల కిష్టయ్య ఉన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI