Dharmaram: బిఆర్ఎస్‌పై మండిపడ్డ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Dharmaram: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బిఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

RAMESH, DHARMPURI
Published on: 13 Nov 2026 5:33 PM IST
Dharmaram
X

Dharmaram: బిఆర్ఎస్‌పై మండిపడ్డ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ధర్మారం: ఈ కరువు కాలం తెచ్చింది కాదని కెసిఆర్ తెచ్చిన కరువు అని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ స్కీమ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలో కోటి లక్షల ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేయడం జరిగింది వారు తెలిపారు.... అందులో భాగంగా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని వారు తెలిపారు.... కాలేశ్వరం కట్టి తెలంగాణ ప్రజలపై టోపీ పెట్టారని కాక తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తే ఈ కరువు వచ్చేది కాదని వారన్నారు.

ఈ కరువు కాలం తెచ్చింది కాదు కెసిఆర్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కార్యక్రమం ప్రాజెక్టు పొంగిపోయిందని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర అప్పుల ఊబిలో నెట్టిందని చుక్క నీరు రైతులకు అందించలేదని అన్నారు. ప్రస్తుత కరువలో కాలేశ్వరం ప్రాజెక్టు లో నీళ్లు నిలపడం లేదని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మండి పడ్డారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI