Peddapalli: దళిత ఆత్మగౌరవంపై దాడిని తిప్పికొట్టాలి

Peddapalli: పెద్దపల్లిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ మహాసభలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ; ఐక్యంగా పోరాడాలని పిలుపు.

RAJU, PEDDAPALLI
Published on: 22 Nov 2026 8:01 PM IST
Peddapalli
X

Peddapalli: దళిత ఆత్మగౌరవంపై దాడిని తిప్పికొట్టాలి

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ మహాసభలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు.

తొలుత బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ.. అనంతరం ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంఘం నాయకులు, సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఐదు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సంఘానికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని, ప్రజల గొంతుకను నొక్కేస్తూ విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.

రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, నిధుల కేటాయింపుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని, దళిత సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ సూచించిన బోధించు.. సమీకరించు.. పోరాడు అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI