Peddapalli: నేత్ర, అవయవ దాతలే నిజమైన దేవుళ్లు: ప్రభుత్వ విప్!

Peddapalli: నేత్ర, అవయవ దాతలే నిజమైన దేవుళ్లని ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఓదెలలో సదాశయ ఫౌండేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 11 Oct 2026 4:36 PM IST
Peddapalli
X

Peddapalli: నేత్ర, అవయవ దాతలే నిజమైన దేవుళ్లు: ప్రభుత్వ విప్!

పెద్దపెల్లి: నేత్ర,అవయవ దాతలే నిజమైన దేవుళ్ళని ఇంకొకరి ప్రాణానికి చూపుకు చేయూత ఇచ్చే దానికంటే ఏది పెద్దది కాదని ప్రభుత్వ విప్‌,పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మరణానంతరం విలువైన అవయవాలను దానం చేసి.. మరో దేహంలో చిరంజీవులుగా జీవించాలని పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా ఓదెలలో ఓ ఫంక్షన్ హాల్లో సదాశయ ఫౌండేషన్‌ 18వ వార్షికోత్సవ వేడుకలు సదాశియ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు భీష్మచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానాలు చేసిన వారి కుటుంబ సభ్యులను జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు.

అవయవదానంలో ఓదెల ముందంజ అభినందియం

బీస్మచారి బృందాన్ని సేవలు మరువలేం మండల కేంద్రం ఓదెల లలో స్థానిక ఆర్ఎంపి వైద్యులుగా సదాశివ ఫౌండేషన్ ప్రతినిధిగా నిరంతర సేవలందిస్తున్న డాక్టర్ భీష్మాచారి బృందం అభినందియమని ఎమ్మెల్యే విజయరమణారావు కొనియాడారు.తన ఆత్మీయులను కోల్పోయిన బాధలోనూ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన దాతల కుటుంబ సభ్యులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, శిరస్సు వంచి ప్రణమాలు అర్పించారు.

ఆత్మీయులను కోల్పోవడం బాధాకరమైనప్పటికీ, చనిపోయిన మనిషి మన మధ్య లేకపోయినా వారి కళ్ళ ద్వారా మరొక జీవి ఈ ప్రపంచాన్ని చూడగలగడం చాలా సంతోషకరమైన విషయం. ఓదెల గ్రామంలోనే దాదాపు 200 మందికి పైగా మరియు మండల వ్యాప్తంగా సుమారు 280 మంది వరకు నేత్రదానం చేయడం అభినందనీయం.​సదాశివ ఫౌండేషన్ నిర్వాహకులు భీష్మాచారి మరియు వారి కమిటీ సభ్యులు తమ నిత్య జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలను ఓదార్చి, ఒప్పించి ఎటువంటి నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సేవా దృక్పథంతో నేత్రదానం పూర్తి చేయించడం గొప్ప విషయము. ​సదాశివ ఫౌండేషన్ సేవలకు గాను ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు తెచ్చేందుకు, ఓదెల గ్రామానికి నమూనా గుర్తింపు దక్కేలా నా వంతుగా శాయశక్తులా కృషి చేస్తాను.

నేత్రదానానికి ముందుకు రావాలి..జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పవిత్ర

వెలకట్టలేని నేత్రాలు, అవయవాలను దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్రదానాలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. నేత్రదానాల కోసం సాంకేతిక నిపుణులు చేస్తున్న కృషితోపాటు సదాశయ ఫౌండేషన్‌ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. తాను కూడా మరణానంతరం నేత్రదానం చేసేందుకు త్వరలో అంగీకారం తెలుపుతానని వేదికపై ప్రకటించారు.

దాతల కుటుంబాలకు సన్మానం

గత ఏడాది నేత్ర, అవయవ, శరీర దానాలు చేసిన వారి కుటుంబ సభ్యులతోపాటు దానాలను ప్రోత్సహించినవారిని, వార్షికోత్సవ నిర్వహణకు సహకరించిన సంస్థల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గొప్పగాని సారయ్య గౌడ్, స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, స్థానిక ఓదెల సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ అమర్నాథ్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సహాబేజ్ ఖాన్, ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫౌండేషన్‌ ప్రతినిధులు , ఓదెల మండల అధ్యక్షులు కొండ్ర వేణు, క్యాతం వెంకటేశ్వర్లు,ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, క్యాతం మల్లేశం అల్లం సతీష్ జీడి నవీన్ మహిళా ప్రతినిధులు క్యాతం భాగ్యలక్ష్మి మెరుగు దేవకి మెరుగు కవిత తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli