Sultanabad: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విప్ విజయరమణ రావు

Sultanabad: సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.

KONDAL, SULTANABAD
Published on: 10 Nov 2026 4:53 PM IST
Sultanabad
X

Sultanabad: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విప్ విజయరమణ రావు

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి బొంతకుంటపల్లి,గర్రెపల్లి,భూపతిపూర్,నారాయణపూర్ మరియు ఎలిగేడు మండలం బుర్హన్మియపేట,సుల్తాన్ పూర్, నారాయణపల్లి,నర్సాపూర్, ర్యాకల్దేవుపల్లి,రాములపల్లి గ్రామాల్లో ఐకేపీ & సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ...

రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులను పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అలాగే సూపర్ ఎల్నినో కారణంగా భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

యాసంగిలో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సమృద్ధిగా పండే మొక్కజొన్న (మక్కలు), శెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దలారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు మండలంలో ఐకేపీ మరియు సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు, సింగిల్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, రైతులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు...

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD