Peddapalli: మహిళా సాధికారత, రైతుల సంక్షేమమే లక్ష్యం: విప్ విజయరమణ రావు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రూ.40 లక్షలతో మహిళా భవనాలకు భూమిపూజ చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.
Peddapalli: మహిళా సాధికారత, రైతుల సంక్షేమమే లక్ష్యం: విప్ విజయరమణ రావు!
పెద్దపల్లి: మహిళా సాధికారత, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలోని కొలనూరు, రూపునారాయణపేట, బయమ్మపల్లి, గుంపుల గ్రామాల్లో మొత్తం రూ. 40 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ చేశారు.
అనంతరం రూపునారాయణపేట, బయమ్మపల్లి, గుంపుల, గుండెం గ్రామాల్లో ఐకేపీ (IKP) మరియు సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని, నూతన భవనాల నిర్మాణంతో సంఘాల కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. అలాగే రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సింగిల్ విండో చైర్మన్, స్థానిక సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐకేపీ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




