Manthani: మంథని ఆర్టీసీ డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యూనియన్ నాయకులు, కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 27 Nov 2026 12:01 PM IST
Manthani
X

Manthani: మంథని ఆర్టీసీ డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

మంథని: మంథని ఆర్టీసీ డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యూనియన్ నాయకులు, కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్మికులు ఒకచోట చేరి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. యూనియన్ జెండా ఆవిష్కరించి వేడుకల్లో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని, యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు.

టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంథని డిపోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిపో టీఎంయూ అధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి కేకే రెడ్డి, ఐలయ్య, సడవలయ్య, రవీందర్, మునీర్, గోపాల్, సారయ్య, లక్ష్మణ్, హరికృష్ణ, అఖిల్, సాగర్ తదితర యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI