Manthani: బతుకమ్మ ఆడిన మంథని ఆర్డీవో, మున్సిపల్ అధికారులు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీవో సురేష్, చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

SHANKAR, MANTHANI
Published on: 16 Oct 2026 9:25 PM IST
Manthani
X

Manthani: బతుకమ్మ ఆడిన మంథని ఆర్డీవో, మున్సిపల్ అధికారులు!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్ మహిళా సిబ్బంది సైతం ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

బతుకమ్మ పాటలు, ఆటలతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI