Manthani: 400 మీటర్ల పరుగులో ఆనందికి స్వర్ణం.. జాతీయ పోటీలకు ఎంపిక!
Manthani: ఖమ్మంలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్ర అథ్లెటిక్స్‌లో కమాన్‌పూర్‌కు చెందిన నల్లవెల్లి ఆనంది 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.
Manthani: 400 మీటర్ల పరుగులో ఆనందికి స్వర్ణం.. జాతీయ పోటీలకు ఎంపిక!
మంథాని: అథ్లెటిక్స్‌లో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ యువ క్రీడాకారిణి నల్లవెల్లి ఆనంది తన ప్రతిభను చాటుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
పోటీలో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి అద్భుతమైన వేగం, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న ఆనంది జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్న 70వ జాతీయ పాఠశాల క్రీడల అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
స్థానికంగా సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల కమాన్‌పూర్ మండల ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ఆనంది ఇదే ప్రతిభను కనబరిచి పతకం సాధించాలని, తెలంగాణ రాష్ట్రంతో పాటు కమాన్‌పూర్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.




