Peddapalli: డ్రైనేజీ అస్తవ్యస్తం.. పైప్‌లైన్ లీకేజీ: గ్రామస్తుల ఆగ్రహం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లిలో మురుగు కాలువలు నిలిచి, తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 14 Oct 2026 2:50 PM IST
Peddapalli
X

Peddapalli: డ్రైనేజీ అస్తవ్యస్తం.. పైప్‌లైన్ లీకేజీ: గ్రామస్తుల ఆగ్రహం!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై గ్రామం అపరిశుభ్రతమయంగా మారిందని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మురికి కాలువలను సరిగా లేక డ్రైనేజీ నీరు ఇళ్ల ముందే నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నిలిచిన మురికి నీటితో దోమలు విపరీతంగా పెరిగిపోయి రాత్రి వేళల్లో నిద్ర కరువై రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

​మరొకవైపు పాత గ్రామపంచాయతీ సమీపంలో ప్రధాన తాగునీటి పైప్‌లైన్ లీకేజీ అయి నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీనివల్ల పైప్‌లైన్‌లోకి మురికినీరు చేరి కలుషిత నీరు సరఫరా అవుతోందని, ఆ నీటిని తాగి పలువురు గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు.

​మండలానికి ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్)గా జిల్లా సహకార సంఘం అధికారి, ఇన్చార్జి (DPO)గా శ్రీమాల బాధ్యతల్లో ఉన్నప్పటికీ, గ్రామంలోని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని, లీకేజీ అయిన తాగునీటి పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి మంచినీటిని అందించాలని వెన్నంపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli